Thursday, January 15, 2026
Homeజిల్లాలుఅనంతపురంవిద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి

- Advertisement -

సర్పంచ్ మోనాలిసా

విశాలాంధ్ర-ఉరవకొండ (అనంతపురం జిల్లా) : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోనాలిసా సూచించారు. గురువారం మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న భోజనాన్ని, వంట గదిని పరిశీలించారు. నిత్యావసర సరుకులను, రిజిష్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. అనంతరం తరగతి గదుల్లో పాఠ్యాంశాలను బోధించారు. విద్యార్ధులను ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు