Thursday, January 15, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదీపం, ఉజ్వల యోజన గ్యాస్ పథకాలు పేద ప్రజలకు వరం..

దీపం, ఉజ్వల యోజన గ్యాస్ పథకాలు పేద ప్రజలకు వరం..

- Advertisement -

జాయింట్ కలెక్టర్ మౌర్యా భరద్వాజ్
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో దీపం, ఉజ్వల యోజన గ్యాస్ పథకాలు పేద ప్రజలకు వరంగా మారాయని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో ఉన్నటువంటి హెచ్.పీ గ్యాస్ గోవింద చౌదరి డీలర్కు సంబంధించినటువంటి పలు పథకాలను వారు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పరిశీలించారు. అనంతరం వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని పోతుకుంట గ్రామంలో దీపం గ్యాస్ పథకము ఉజ్వల యోజన గ్యాస్ పథకం పై నలుగురు లబ్ధిదారుల వద్ద వెళ్లి దీపం పథకం ఉజ్వల దీపం పథకం ఏ విధంగా మీకు వచ్చింది? ఏమైనా ఇబ్బందులు ఎదురైనయా? ఈ పథకాలు మీకు సంతృప్తిని ఇస్తున్నాయా? సబ్సిడీ పడుతోందా? అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ కొనుగోలు చేసినప్పుడు ఎంఆర్పి ధర మాత్రమే చెల్లించాలని, అధికంగా చెల్లించకూడదని సూచించారు. అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని వారు ఆరా తీశారు. ఉజ్వల, దీపం పథకం యొక్క సబ్సిడీలు మీ ఖాతాలోకి పడుతున్నాయా అన్న ప్రశ్నకు లబ్ధిదారుల నుండి సంతృప్తికరమైన సమాధానం రావడంతో జాయింట్ కలెక్టర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్వయంగా లబ్ధిదారులే హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ గోవింద చౌదరి ద్వారా మాకు మా గ్రామాలలో కరపత్రాలు అందడం జరిగిందని, తద్వారానే మాకు ఈ సమాచారం అందడంతో, గ్యాస్ను తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. తదుపరి గ్యాస్ ఏజెన్సీ వారిని స్వయంగా జాయింట్ కలెక్టర్ అభినందించారు. అనంతరం ఇటువంటి పథకాలను మరింత ప్రచారం చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సి ఎస్ డి టి చెన్నకేశవ నాయుడు, గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు