– డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద గల స్పందన చర్మవ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు ప్రారంభించడం జరిగిందని హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మేటిమలు, పులిపిర్లు, వెంట్రుకలు రాలుట, మంగు, మచ్చలు, ఎగ్జిమా, దురద, స్కిన్ ఎలర్జీ, దద్దుర్లు, సోరియాసిస్, బొల్లి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, సుఖ వ్యాధులకు ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ మంజీరాచే వైద్య చికిత్సలు, పాటించాల్సిన పద్ధతులను కూడా తెలపడం జరుగుతుందన్నారు. పులిపిర్లు, ఆనెలు నొప్పి లేకుండా ప్రత్యేక పరికరంతో తొలగించడం జరుగుతుందన్నారు. ఈ సేవలు వినియోగించుకునేవారు మధ్యాహ్నం 12:30 నుండి 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సేవలు అందిస్తారని తెలిపారు. కావున పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
స్పందన హాస్పిటల్ లో చర్మవ్యాధుల వైద్య సేవలు ప్రారంభం
- Advertisement -
RELATED ARTICLES


