Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపాలిసెట్ పరీక్షల్లో ధర్మవరం విద్యార్థి గాండ్ల చరణ్య కు రెండవ ర్యాంక్..

పాలిసెట్ పరీక్షల్లో ధర్మవరం విద్యార్థి గాండ్ల చరణ్య కు రెండవ ర్యాంక్..

- Advertisement -

పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన పాలిసెట్ పరీక్ష ఫలితాలలో ధర్మవరం పట్టణానికి చెందిన గాండ్ల చరణ్య శ్రీ సత్యసాయి జిల్లాలో రెండవ ర్యాంక్ సాధించడం జరిగిందని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లాలోమొదటి ర్యాంకులో హిందూపూర్ పట్టణానికి చెందిన కురబ గోవిందరాజులు 120 మార్కులకు గాను 113 మార్కులతో 575 ర్యాంకుతో మొదటి స్థానము, తదుపరి రెండవ స్థానంలో ధర్మవరం పట్టణానికి చెందిన గాండ్ల చరణ్య 120 మార్కులకు గాను 112 మార్కులతో 664 ర్యాంకు తో జిల్లా రెండవ స్థానం, తదుపరి మూడవ స్థానంలో హిందూపురం పట్టణానికి చెందిన శాల్వి ప్రవచన 120 మార్కులకు గాను 11 మార్కులు లతో 732 ర్యాంకులో రావడం జరిగిందన్నారు. తదుపరి ధర్మవరం పట్టణములోని పాలిటెక్నిక్ కళాశాలలో పామిశెట్టి ప్రణవ్ కార్తీక్ అనే విద్యార్థి ఉచిత కోచింగ్ తో తన ప్రతిభను పరీక్షలో ఘనపరిచి 120 మార్కులకు గాను 111 మార్కులు లతో 809 ర్యాంకు సాధించడం జరిగిందన్నారు. తదనంతరం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు ఆధ్యాపకుల బృందం ర్యాంకులు తెచ్చిన విద్యార్థులకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు