విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్ డి టి యొక్క ప్రతిష్టాత్మక గ్రామీణ కిర్కెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆర్సిఎల్ 2025 లో భాగంగా ధర్మవరం ఆర్డిటి క్రీడా మైదానంలో ధర్మవరం క్రికెట్ జట్టు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని కోచ్ రాజశేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
క్రికెట్ మైదానంలో బత్తలపల్లితో ఆటలాడగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధర్మవరం 40 ఓవర్లలో 284/5 పరుగులు చేసింది అన్నారు. గోవర్ధన్ 69 బంతుల్లో 72 పరుగులు చేయగా, వేద వ్యాస్ 41 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం జరిగిందన్నారు. బత్తలపల్లికి చెందిన కుశల్ 2 వికెట్లు పడగొట్టాడు అని, బత్తలపల్లి జట్టు 55 పరుగులకే ఆలౌట్ కాగా, ధర్మవరానికి చెందిన సాయి సంతోష్ , కుందన్ చెరో 3 వికెట్లు చేయడం జరిగిందన్నారు. కే ఎల్ ఎం ఎస్ సిల్క్ హౌస్ ఓనర్ చింతా రవి , ధర్మవరం ఏరియా టీమ్ లీడర్ శ్రీనివాసులు గారు టాస్ వేసి మ్యాచ్ ని స్టార్ట్ చేయడం జరిగిందన్నారు.
ఆర్డిటి క్రికెట్లో సత్తా చాటిన ధర్మవరం జట్టు.. ఆర్డిటి క్రికెట్ కోచ్ రాజశేఖర్
- Advertisement -
RELATED ARTICLES


