రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖులు
విశాలాంధ్ర ధర్మవరం; ప్రభుత్వ వైద్య కళాశాల ను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, ప్రముఖ న్యాయవాదులు సుమలత, అతావుల్లా, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తుంపర్తి పరమేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హరి, జిల్లా కార్యదర్శి పెద్దన్న ,తదితర నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్జీవో హోం లో రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులతో పాటు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష, చేనేత కార్మిక సంఘం నాయకులు ఖాదర్బాషా, సన్నప్పయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున, ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి పోతులయ్య, ఎం ఎస్ యు ఐ రావుల చెరువు సురేష్ ,ఏపీ ఎస్ ఎఫ్ బండి శివ, సిఐటియు నాయకులు ఆదినారాయణ, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి శ్రావణి, షబ్బీర్, నరేష్, సాకే హరీష్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షులుగా డాక్టర్ ఆదిశేషు నిర్వహించారు. అనంతరం ప్రముఖులు మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం పీపీపీ పద్దతి ద్వారా వైద్య విద్యని పూర్తిగా ప్రైవేట్ శక్తులకు ఇవ్వాలిఅన్న నిర్ణయం మంచిది కాదన్నారు పెనుకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా 2023 లో గత ప్రభుత్వం ప్రారంభించి, సుమారు 30 కోట్ల వరకు ఖర్చు పెట్టింది అని, ఇంత ఖర్చు పెట్టి ప్రైవేట్ వారికి ఇవ్వాలసిన అవసరం ఏముంది? తక్షణమే కూటమి ప్రభుతం, ప్రైవేటికరణను విరమించు కోవాలి అని తెలిపారు.ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కాలేజీల అవసరం చాలా వుంది అని, 500కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసి, వెనుక బడిన ప్రాంతం, కొత్త జిల్లా, పెనుకొండలో సత్వరం మెడికల్ కళాశాల నిర్మాణం ప్రారంభించాలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ప్రభుత్వ మెడికల్ కాలేజ్లలో ఫీజులు వుండవు, ప్రభుత్వం బాధ్యత వహించి వైద్య సేవలు అందిస్తుంది అని అన్నారు. ఇక్కడ మెడికల్ కాలేజీ వస్తే సూపర్ స్పెషల్టీస్ గుండె, మూత్రపిండం, మెదడుకు, నాడి వ్యవస్థకు సంభందించిన బ్రాంచెస్ వస్తాయి అని, పేద మధ్య తరగతి వారికి ఉపయోగకరంగా ఉంటుంది అని తెలిపారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీ వస్తే ఫీజుల భారం పడుతుంది అని, ఆరోగ్యం అత్యంత ఖరీదై పోతుంది అని, పి పి పి పరం చేయడం అంటే ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయడమేనని, ప్రభుత్వం భాద్యతల నుండి తప్పు కోవడం దుర్మార్గం అని తెలిపారు. కార్పొరేట్ లకు వేలకోట్లు అప్పులు మాఫీ చేస్తారు కానీ, మెడికల్ కాలేజీ ల నిర్మాణానికి 3వేల కోట్లు ఖర్చు చేయకపోవడం దివాలా కోరుతనంకు నిదర్శనం అన్నారు. అదేవిధంగా పి పి పి మోడల్ సక్సెస్ కాలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా క్లిష్ట సమయాల్లో లో ఆదుకున్నది ప్రభుత్వ వైద్యమే అని, ప్రైవేట్ పరం చేస్తే పేదలకు, మధ్య తరగతికి విద్య, వైద్యం దూరం అవుతాయి అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను పిత్రీ విధానం చేయకుండా ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మొత్తం మీద రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి..
- Advertisement -
RELATED ARTICLES


