Sunday, December 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రంథాలయ ఉద్యమకారులను స్ఫూర్తిగా తీసుకోవాలి..

గ్రంథాలయ ఉద్యమకారులను స్ఫూర్తిగా తీసుకోవాలి..

- Advertisement -

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం;; గ్రంథాలయ ఉద్యమకారులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లోని ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మూడవరోజు ఆదివారం ఉద్యమకారుల చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించుకొని వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. పి ఈ టి సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు.అనంతరం అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమకారుడు అయ్యంకి వెంకట రమణయ్య పత్రికా సంపాదకుడని, ఆయుర్వేదము, ప్రకృతి వైద్యములో సిద్ధహస్తులను తెలిపారు. గ్రంథాలయ ఉద్యమమునకు తన జీవితమును ప్రాణంగా పెట్టి విశేష కృషి సల్పిన మహనీయుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రాము, సరస్వతమ్మ, రమణా నాయక్, ముకుందా, గంగాధర్, 40 మంది విద్యార్థులు, అధిక సంఖ్యలో పాఠకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు