జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇష్టానుసారం నోరు పారేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ పత్రములో 45.80 ఎకరాల భూమి ఉండేది అని, అది వెబ్లాండ్ లో 77.54 ఎకరాలకు ఏ విధంగా పెరిగిందో అక్కడే మీ అవినీతి కబ్జాల బాగోతం బయటపడిందని తెలిపారు. సర్వేనెంబర్ 295, 296 లో ఏ విధంగా భూమి పెరిగిందో ప్రజలకు తెలియజెప్పాలని పెద్దిరెడ్డికి సవాల్ విసిరారు. పెద్దిరెడ్డిలో నిజాయితీ ఉంటే మీరు దోషులు కాకపోతే మీరే సి.బి.ఐ ఎంక్వైరీని కోరి మీ నిజాయితీని నిరూపించుకోవాలని వారు సవాల్ విసిరారు. నేటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిస్వార్థ నాయకుడని దేశంలో ఎక్కడా లేనివిధంగా స్వయంగా అటవీశాఖ మంత్రి పర్యటించి మీ దోపిడిని భూ భాగోతాన్ని ప్రజల దృష్టికి తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. అటవీశాఖ భూములు పెద్దిరెడ్డి కబ్జా చేసేది వాస్తవమేనని వారు తెలిపారు. అనవసరంగా రాజకీయం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లపై విమర్శలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. పెద్దిరెడ్డి భూభాగోతం కూడా పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో షూట్ చేసి ప్రజలకు వివరించడం జరిగిందని తెలిపారు. ఇకనైనా పెద్దిరెడ్డి బుద్ధి తెచ్చుకొని నోరు అదుపులో పెట్టుకొని తిరుమల కల్తీ నెయ్యి విషయములో వైసీపీ నాయకుల తప్పు, అవినీతి బాగోతం బయటపడుతుందని విచారణ ఎదుర్కొంటున్న సీఐను సీట్ అధికారుల ముందు హాజరవుతున్న క్రమంలో ట్రైన్ లో వస్తున్న సిఐని హత్య కావించారని ప్రజలు కూడా అనుకుంటున్నారని, సీఐ అనుమానస్పద మృతి పై నిజ నిజాలు బయటకు తీయాలని వారు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారం మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది..
- Advertisement -
RELATED ARTICLES


