Wednesday, March 12, 2025
Homeజిల్లాలుకర్నూలుచిన్నతుంబలంలో చెత్త బుట్టలు పంపిణీ

చిన్నతుంబలంలో చెత్త బుట్టలు పంపిణీ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో గ్రామ సర్పంచ్ మాల బసమ్మ ఆధ్వర్యంలో మంగళవారం చెత్త నుంచి సంపద కార్యక్రమంలో భాగంగా ఈఓఆర్డి జయరాముడు, పంచాయతీ కార్యదర్శి దస్తగిరి, టిడిపి నాయకులు శివ, వీరేష్ గౌడ్, సిద్ధప్ప దని, నరసప్ప, సాగునీటి సంఘం అధ్యక్షులు చాకలి నారాయణ లు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్లలోని పొడి చెత్త, తడిచెత్తను వేరు చేసి రెండు బుట్టలలో వేయాలన్నారు. చెత్త బండి ఇంటి వద్దకు వచ్చినప్పుడు పొడి చెత్త, తడిచెత్తను పారిశుధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరసింహులు, నాగప్ప, నాగరాజు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు