Tuesday, November 18, 2025
Homeఆంధ్రప్రదేశ్హోమియో వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

హోమియో వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

- Advertisement -

విశాలాంధ్ర – తూర్పుగోదావరి :  ఆల్కట్ గార్డెన్స్ లోని నగరపాలక సంస్థ హోమియో వైద్యశాలను జిల్లా కలెక్టర్, కమిషనర్ (F.A.C) పి. ప్రశాంతి గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి ఓ.పి. సేవలు, మందుల నిల్వలు, అందుతున్న వైద్య సేవలపై  సమీక్షించారు.డాక్టర్లు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన మెడిసిన్లు తక్షణం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆరోగ్య కేంద్రం ఆవరణ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, వాతావరణ మార్పులు, వర్షాకాలంను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు ఆసుపత్రిలో సిద్ధంగా ఉంచాలని సూచించారు. సీజనల్ వ్యాధులు మరియు ఇతర వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు