Tuesday, November 18, 2025
Homeఆంధ్రప్రదేశ్సూపర్ సిక్స్ లో అన్నదాత సుఖీభవ కై ట్రాక్టర్ ర్యాలీ

సూపర్ సిక్స్ లో అన్నదాత సుఖీభవ కై ట్రాక్టర్ ర్యాలీ

- Advertisement -

విశాలాంధ్ర – తాళ్లపూడి : రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు అద్వర్యం లోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చెయ్యటం లో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం అమలులోకి వస్తోందని టీడీపీ యువగళం నాయకులు కాకర్ల సత్యేంద్ర పేర్కొన్నారు. ఎన్డీయే అద్వర్యం లో  కొవ్వూరు లో గురువారం జరిగే కొవ్వూరు ఏ.ఎం.సి. ప్రమాణ స్వీకారానికి తాళ్లపూడి మండల యువగళం నాయకులు, ఎన్డీయే కూటమి నాయకులు అభిమానులు వందలాదిగా తాళ్లపూడి నుండి ఎంతో హట్టహాసంగా ట్రాక్టర్లు తో ర్యాలీ గా బయలు దేరి వెళ్లారు. తాళ్లపూడి మండలం అన్నదేవరపేట, గజ్జరం, పోచవరం, తాడిపూడి, టి.మెట్ట, వేగేశ్వరపురం బల్లిపాడు గ్రామాలకు చెందిన ఎన్డీయే కూటమి నాయకులు అద్వర్యం లో ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. కాకర్ల సత్యేంద్ర, కూచిపూడి గణపతి, భరత్, కొర్లపాటి లక్ష్మణ రావు, ఎం.ఎస్, గజ్జరం ఉప సర్పంచ్ డి.శేషు, రాగోలపల్లి సొసైటీ అధ్యక్షులు అనపర్తి ప్రసాద్, తీగిరిపల్లి కనకరత్నం, కాకర్ల శ్రీను, కైగాల శ్రీను, మద్దుకురి శంకరం, జగదీష్, ఉప్పులూరి రమేష్, అన్నమరెడ్డి రమణ, ఎన్డీయే కార్యకర్తలు అభిమానులు వందలాదిగా తరలి వెళ్లారు. బల్లిపాడు కాకర్ల కల్యాణ మండపం ప్రాంగణం టీడీపీ నాయకులు, వారు వేసుకొచ్చిన ట్రాక్టర్ల తో కళకళ లాడింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు