Homeఆంధ్రప్రదేశ్సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దు

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దు

- Advertisement -

– ఉచితాలకు ఆశ పడవద్దు

– గాయత్రి విద్యాసంస్థల విద్యార్దులకు అవగాహన 

– ఉత్తర మండలి డీఎస్పీ వై.శ్రీకాంత్

విశాలాంధ్ర – రాజానగరం : సైబర్ నేరగాళ్లు పన్నే ఉచ్చులో ఎవ్వరు పడవద్దనీ,కొద్దిపాటి అవగాహనతో అప్రమత్తం కావాలని రాజమహేంద్రవరం ఉత్తర మండలి డీఎస్పీ వై.శ్రీకాంత్ అన్నారు. మండలంలోని కానవరం గ్రామంలోని గాయత్రి విద్యాసంస్థల నందు రాజానగరం సీఐ ఎస్.ప్రసన్న వీరయ్య గౌడ్ అధ్యక్షతన గాయత్రి విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి వివివి ఎస్ ఎన్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్దులకు శుక్రవారం జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ కలియుగం, రాతియుగం, స్వర్ణయుగం అని ఒక్కప్పుడు చెప్పుకొనే వాళ్ళమని ప్రస్తుతం డిజిటల్ యుగం అని కొంతమంది చెప్పుకుంటూ చదువును పక్కదారి పెడుతున్నారని చెప్పారు.దీంతో విద్యార్థులు ఎంతో కోల్పోతున్నారని వాపోయారు. సైబర్ నేరగాళ్ల మాటలకు సమాజంలో అనేక మంది ప్రజలు,విద్యార్దులు మోసపోకుండా ఉండేందుకు విద్యార్దులకు పిపిటి ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉచితాలకు ఎవ్వరు ఆశ పడవద్దని, సైబర్ నేరగాళ్లు చెప్పే మాయ మాటలకు లోనవ్వద్దన్నారు. సభాధ్యక్షులు సీఐ ఎస్.ప్రసన్న వీరయ్య గౌడ్ మాట్లాడుతూ సైబర్ నేరాలు భారిన వారు వెంటనే స్తానిక పోలీసులను ధైర్యంగా ఆశ్రయించాలని, వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్ కి ఫిర్యాదు చెయ్యాలని కోరారు. విశిష్ట అతిథిగా హాజరైన గాయత్రి విద్యాసంస్థల కార్యదర్శి వివిఎస్ఎన్ మూర్తి ,  ప్రిన్సిపాల్ దేవి బంగారం మాట్లాడుతూ సైబర్ నేరాలు పట్ల సమాజానికి అవగాహన కల్పించడానికి విద్యార్దులు నడుం బిగించాలని కోరారు. విద్యార్దులు ద్వారానే ఆన్లైన్ మోసాలు ,సైబర్ నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు.అందుకు కోసమే విద్యార్దులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.తల్లిదండ్రులకు,ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం సైబర్ విభాగం సిబ్బంది సురేష్ , మహేష్ రవికుమార్, గాయత్రి విద్యాసంస్థలు అధ్యాపకులు,ఉపాధ్యాయులు, విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు