విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సూపర్డెంట్ గా డాక్టర్ తిపేంద్ర నాయక్ పదవీ బాధ్యతలను చేపట్టారు. గతంలో ఉన్న డాక్టర్ మాధవి ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ గైనకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్గా కొనసాగుతారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, కార్యాలయ సిబ్బంది డాక్టర్ తిపేంద్ర నాయక్ కు శుభాకాంక్షలు అని తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి బాటలో నడుపుతానని, రోగులకు అందరికీ అందుబాటులో ఉంటానని, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న స్ఫూర్తిని ప్రజలందరికీ అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది సహాయ సహకారాలతో ఆసుపత్రిని ఒక మంచి గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపర్డెంట్ గా డాక్టర్ తిపేంద్ర నాయక్ బాధ్యతలు స్వీకరణ..
RELATED ARTICLES