దళిత యువకుడు, తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఆయన విచారణ పూర్తయ్యే వరకు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై బయట ఉన్న అనంతబాబు, కేసులోని కీలక సాక్షులను బెదిరించి, ప్రలోభ పెట్టారన్న ఆరోపణలపై మళ్లీ అరెస్ట్ అయ్యారు. బెయిల్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించారని నిర్ధారించిన ప్రత్యేక కోర్టు ఆయన బెయిల్‌ను రద్దు చేసింది. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం దానిని తిరస్కరించింది. తాజాగా జరిగిన విచారణలో, ఈ కేసులో కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ వంటి ఎలక్ట్రానిక్ ఆధారాలను విచారణకు స్వీకరించేందుకు ప్రాసిక్యూషన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో అనంతబాబు విచారణ పూర్తయ్యేంత వరకు జైల్లోనే ఉండనున్నారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో ఎదురుదెబ్బ
- Advertisement -
RELATED ARTICLES


