Sunday, December 7, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏసీబీ వలలో డోన్‌ డిప్యూటీ తహశీల్దార్‌

ఏసీబీ వలలో డోన్‌ డిప్యూటీ తహశీల్దార్‌

- Advertisement -

రూ.35 వేల లంచం స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్‌

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : రైతు నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన డోన్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం చోటు చేసుకుంది. తహశీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్‌ సునీల్‌ రాజు, ఓ రైతు భూ సమస్య పరిష్కారానికి రూ.35,000 లంచం డిమాండ్‌ చేసినట్లు సమాచారం.ఈ వ్యవహారంపై బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, వారు మంగళవారం పద్ధతి ప్రకారం వల వేయడం జరిగింది. ముందస్తు ఏర్పాట్లతో అధికారులు డోన్‌కు చేరుకుని, డిప్యూటీ తహశీల్దార్‌ సునీల్‌ రాజు లంచం తీసుకుంటున్న క్షణంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.సునీల్‌ రాజు వద్ద నుండి డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, తదనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో విస్తృత సోదాలు నిర్వహించారు. అధికారులు సునీల్‌ రాజును అరెస్ట్‌ చేసి, విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.తహశీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధి కారులు దాడుల విషయం తెలుసుకున్న అధికారులు పట్టణంలోని పలు కార్యాలయాల్లో అధికారులు భయాందోళనకు గురైనారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు