కరెస్పాండెంట్ నరేంద్రబాబు
విశాలాంధ్ర ధర్మవరం;; క్రమశిక్షణతో కూడిన విద్యను ప్రతి బాలిక అభ్యసించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని కరెస్పాండెంట్ నరేంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా సాయి నగర్లో గల సూర్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమాన్ని విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. అదేవిధంగా బాలికలచే సేవ్ గోల్డ్ చైల్డ్ అనే ప్లే కార్డ్స్ ప్రదర్శించి విద్యార్థులచే నినాదాలు చేయించారు. ప్రతి బాలిక తల్లిదండ్రుల యొక్క కష్టాలను గుర్తిస్తూ ఉపాధ్యాయుల యొక్క చదువును ఆ కుంటిత దీక్షతో, పట్టుదలతో, తపనతో అభ్యసించినప్పుడే విజయం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
క్రమశిక్షణతో కూడిన విద్యను ప్రతి బాలిక అభ్యసించాలి..
RELATED ARTICLES