స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం;; ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలని స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియాలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి దగ్గర గల స్పందన హాస్పిటల్ లో ఉచిత బిపి, షుగర్ పరీక్షలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి సమాజంలో షుగర్ బీపీలు, సర్వ సాధారణమైనవని, అలాంటి వాటి పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ ఘంటసాల రాఘవ రోగులకు వైద్య చికిత్సలను అందించి, పరీక్షలు పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపారు. ఈ కార్యక్రమంలో 55 మంది షుగర్ బీపీ పరీక్షలకు రావడం జరిగిందని, వారందరికీ ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది బాబా ఫక్రుద్దీన్, దిల్దార్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి..
- Advertisement -
RELATED ARTICLES


