ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;; గ్రామాల సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యము అని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని తుమ్మల గ్రామ పంచాయతీలోని మల్లెన పల్లి గ్రామం మొత్తం వారు పరిశీలించారు. గ్రామంలో ఎక్కడెక్కడ సమస్యలున్నాయి వాటిపై ప్రజల ద్వారా ఆరా తీశారు. తదుపరి ప్రజలతో మమేకమై ఎక్కడెక్కడ మార్పులు చేయవచ్చు అనేది వారి వద్ద చర్చించి తెలుసుకున్నారు. తదుపరి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఉద్యోగులతో సమావేశమై గ్రామ ప్రజలకు సమస్యలను పరిష్కరించడమే సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలని తెలిపారు. తదుపరి వివిధ రాజకీయ పార్టీ నాయకులు వద్దతో కూడా కలిసి మల్లేనిపల్లి వద్ద ఉన్నటువంటి పెద్ద కాలువ సమస్యకు పరిష్కారం కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. సాధ్యమైనంతవరకు ఫిబ్రవరి 15వ తారీకు లోపల సమస్యలను పరిష్కరిస్తామని, అదే మా ప్రణాళిక అని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
గ్రామాల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం
- Advertisement -
RELATED ARTICLES


