Saturday, May 17, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికంటి క్యాన్సర్ వ్యాధి ప్రాథమిక దశలోనే గుర్తించాలి..

కంటి క్యాన్సర్ వ్యాధి ప్రాథమిక దశలోనే గుర్తించాలి..

రిటైర్డ్ జిల్లా ఆంధత్వ నివారణ అధికారి సంకారపు నర్సింహులు
విశాలాంధ్ర ధర్మవరం;; కంటి క్యాన్సర్ వ్యాధి ను ప్రాథమిక దశలోనే గుర్తించాలని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మధు కంటి వైద్యశాలలో పట్టణంలోని పలు డాక్టర్లకు ప్రపంచ కంటి క్యాన్సర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్లతో పాటు వారు కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ కంటికి క్యాన్సర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను వారు తెలియజేశారు. చిన్నపిల్లలకు వచ్చే ముఖ్యమైనది కంటి క్యాన్సర్ అని, సాధారణంగా పుట్టిన బిడ్డ నుండి రెండు సంవత్సరాల వయసు లోపల వారికి, లేదా ఐదేళ్ల వరకు కళ్ళకు వస్తుందని తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రుల నుండి వచ్చే జీన్స్ మార్పుల వలన కూడా క్యాన్సర్ వ్యాధి వస్తుందని తెలిపారు. రెటీనాలో ప్రారంభమై కంటిలోని అన్ని భాగాలకు ఈ వ్యాధి వ్యాపిస్తుందని, తదుపరి కంటి నరము ద్వారా మెదడుకు చేరుతుందని, అప్పుడే అది ప్రాణాంతకం అవుతుందని తెలిపారు. కంటి యొక్క నల్ల గుడ్డులోని కంటిపాపలలో తెల్లటి చుక్కగా కనిపిస్తుందని తర్వాత కంటిలోని మిగతా భాగాలకు వ్యాపిస్తుందని తెలిపారు. ఈ క్యాన్సర్ వ్యాధిని ప్రధమంగా తల్లి గుర్తించే వీలు ఉంటుందని తెలిపారు. గుర్తించిన వెంటనే కంటి డాక్టర్లకు సంప్రదించాలని తెలిపారు. అధునాతనంగా సిటీ స్కానింగ్, ఎమ్మారై స్కానింగ్ ల ద్వారా ఈ వ్యాధి వ్యాపించిన భాగాలను సులభంగా గుర్తించవచ్చునని తెలిపారు. ఈ క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించకపోతే కంటిచూపు పోయే అవకాశం ఉందని తెలిపారు. కంటి క్యాన్సర్ ను మందుల ద్వారా, లేజర్ చికిత్స ద్వారా, రేడియేషన్ చికిత్స ద్వారా చేయవచ్చునని తెలిపారు. అందుకే పెద్దలు అన్నారు “సర్వేంద్రియానం నయనం ప్రధానం” అని తెలిపారు. భయంకరమైన ఈ కంటి క్యాన్సర్ స్వాభావికంగా దానికదే కరిగిపోయే అవకాశం కలదని, కానీ ఆ అవకాశం కోసం ఎదురుచూడడం మాత్రం ఏమాత్రం సమంజసం కాదని వారు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు