విశాలాంధ్ర – తూర్పుగోదావరి : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో గోదావరి వరదల ప్రభావిత కుటుంబాలను, లంకల్లో ఉన్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, నగరంలోని అల్కాట్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు.పునరావాస కేంద్రంలో మెడికల్ క్యాంప్, భోజనంతో పాటు ఇతర వసతి సౌకర్యాలు సమకూర్చినట్లు కలెక్టర్ వివరించారు. ఈ సదుపాయాలపై క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలన చేసి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించి, అధికారులు సూచనలు ఇచ్చే వరకు ఇక్కడే కొనసాగాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తాత్కాలికంగా వసతి పొందుతున్న కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు, భోజన సదుపాయాలు, వసతి ఏర్పాటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అక్కడ పునరావాసం పొందుతున్న వారితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కేతా వారి లంక నుండి 68 మంది, వెదుర్లమ్మ లంక నుండి 126 మంది, గోదావరి గట్టు క్రింద నుండి 7 మంది, గౌతమీ ఘాట్ నుండి 45 మంది, బ్రిడ్జి లంక నుండి 48 మంది తరలించడం జరిగిందనీ అధికారులు వివరించారు.
లంకల్లో ఉన్న కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలింపు
- Advertisement -
RELATED ARTICLES


