*రైతున్న–మీకోసం వారోత్సవాలపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి టెలికాన్ఫరెన్స్*
*నవంబర్ 24 నుంచి 30 వరకు వారోత్సవాలు*
*రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఏర్పాట్లు*
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
విశాలాంధ్ర – తూర్పుగోదావరి : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నవంబర్ 24 నుండి 29, 2025 వరకు “ *రైతున్న– మీకోసం* ” వారోత్సవాలు ప్రతి రైతు సేవా కేంద్రం (RSK) పరిధిలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి క్షేత్రస్థాయి వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య మరియు అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేస్తూ, ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశాల ప్రకారం రైతుల జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధికి శాశ్వత మార్పు తీసుకురావడం లక్ష్యంగా ఈ వారోత్సవాలు ఇంటింటి ప్రచారం కార్యక్రమం గా నిర్వహించ వలసి ఉందన్నారు. ఇంటింటికీ వెళ్లి రైతులను కలుసుకునే విధంగా 7 రోజులపాటు *హౌస్-టు-హౌస్* ప్రచార కార్యక్రమం చేపట్టవలసి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించిన ఐదు సూత్రాలు పై ఈ ప్రచారం చివరి మైలు వరకు చేరవలసి ఉందన్నారు. అందులో భాగంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత వ్యవసాయం, వ్యవసాయ పద్ధతుల్లో సాంకేతికత, ఆహార ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు అనే విషయాన్ని స్పష్టంగా రైతులకి అవగాహనా కల్పించడం ముఖ్యం అన్నారు. షెడ్యూల్ & కార్యాచరణ: నవంబర్ 24 నుండి 29 వరకు రైతుల ఇళ్లను సందర్శిస్తారు. నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు సందర్శనల ద్వారా సేకరించిన డేటా ను సమీకరించి వాటిపై విశ్లేషణ చేయాలన్నారు. డిసెంబర్ 3న 2026–27 సంవత్సరానికి చెందిన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి ప్రతి రైతు సేవా కేంద్రం లో కార్యశాల నిర్వహించా లన్నారు. గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రం ద్వారా నిర్వహించే ఈ ప్రచారంలో ఆర్ ఎస్ కే సహాయకులు, పశుసంవర్ధక /మత్స్య సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, ఎనర్జీ అసిస్టెంట్లు, ప్రగతిశీల రైతులు,. ప్రాథమిక వ్యవసాయ కమిటీ లు, నీటి వినియోగదారులు సంఘాలు ప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులను భాగస్వామ్యం వివరించారు. ప్రతి 3 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా విభజించి, ఒక బృందం రోజుకు 30 క్లస్టర్లు (90 ఇళ్లు) సందర్శిస్తుందన్నారు. ఆరు రోజుల ప్రచారంలో మొత్తం 540 కుటుంబాలు కవర్ చేస్తారు. ఈ సందర్శనలో రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశం లేఖ, కరపత్రం అంద జేయన్నారు. APAIMS యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ఇంటింటి ప్రచారం లో రైతుల నుంచి సేకరించిన సూచనలు, ఫిర్యాదులను నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు పూర్తిగా విశ్లేషించి, డిసెంబర్ 3న ఆర్ ఎస్ కే స్థాయి వర్క్‌షాప్‌లో 2026–27 కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. భాస్కర్ రెడ్డి, ఆర్డీవోలు ఆర్ కృష్ణ నాయక్, రాణి సుస్మిత, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా పశుసంవర్ధక అధికారి కె. శ్రీనివాస్ రావు, జిల్లా హార్టికల్చర్ అధికారి ఎన్. మల్లిఖార్జున రావు, జిల్లా మత్స్య అధికారి టి. నిర్మలా కుమారి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


