Homeజిల్లాలునెల్లూరుచుండిలో 10లక్షలతో సీసీ రోడ్డు కు శంకుస్థాపన

చుండిలో 10లక్షలతో సీసీ రోడ్డు కు శంకుస్థాపన

- Advertisement -

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామం లో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారి సహకారంతో 10లక్షలు రూపాయలతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి మాలకొండ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ చెరువుపల్లి మాల్యాద్రిశంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కందుకూరు నియోజకవర్గం లో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు చెరువు పల్లి సాంబయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు చొప్పర రాఘవులు,చెరువుపల్లి పెద మాల్యాద్రి, చెరువుపల్లి హనుమంతురావు, చొప్పర బ్రహ్మయ్య,ముతకని వెంకట్రావు, ముతకని రవణయ్య, జల్లి మధు, చుండి బ్రహ్మయ్య,బోడ చిరంజీవి, బోడ అంజిబాబు,ఇరుపని అంకయ్య, ఇరుపని లక్ష్మీనరసింహం,ఇరుపని లక్ష్మయ్య, ఇరుపని వెంకన్న, చెరువుపల్లి మల్లికార్జున,చెరువుపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు