Homeజిల్లాలుఅనంతపురంఅంబేద్కర్ విగ్రహం ముందు మౌన దీక్ష

అంబేద్కర్ విగ్రహం ముందు మౌన దీక్ష

- Advertisement -

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఆర్డిటికీ ఎఫ్ సిఆర్ ఏను కేంద్రం పునరుద్ధరించాలని కోరుతూ గురువారం అంబేద్కర్ జయంతి రోజు ఉరవకొండ లో స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ఆర్ డి టి అఖిలపక్ష కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ కి దుర్గాదేవి కళ్ళు తెరిపించాలని ఆర్డిటికు ఎఫ్ సి ఆర్ఏ ను రెన్యువల్ చేసే విధంగా మంచి బుద్ధుని ప్రసాదించాలని కోరారు. 56 ఏళ్లుగా పేద ప్రజలకు సేవలు అందించిన ఆర్డీటీకి కేంద్ర ప్రభుత్వం విదేశీ నిధులు ఆపడం చాలా బాధాకరమన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం తగదు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నరేంద్ర మోడీతో మాట్లాడి ఆర్డిటికీ ఎఫ్ సి ఆర్ ఏ ను పునరుద్ధరించే విధంగా ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈకార్యక్రమంలో ఆర్డిటి అఖిలపక్ష కమిటీ నియోజకవర్గ చైర్మన్ గోపాల్, చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్, నియోజకవర్గ అధ్యక్షులు లత్తవరం చంద్రశేఖర్, సిబిటిల అధ్యక్షులు చికలుగురికి మరెన్న, పాల్తూరు ఆనంద రాజు, సిపిఐ నాయకులు చెన్నరాయుడు, శ్రీధర్ కాంగ్రెస్ నాయకులు సోనియా శినా, అబ్బాసు, సంఘము ఉపాధ్యాయులు బోర్సానిపల్లి ప్రభాకర్, తార్వే నాయక్ ఓబులేసు, బుగ్గయ్య, చంద్రమోహన్, విజయ్ కుమార్ సి.బి.టి విజయ్ కుమార్ మీనుగా రమేష్ బాబు, సుంకన్న ఓంకార్ ప్రసాద్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు