- Advertisement -
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పునర్నిర్మిస్తున్న వన్నూరు స్వామి దర్గా కు గ్రామ సర్పంచ్ మల్లెల జగదీష్ శుక్రవారం రూ, 25,116 విరాళాన్ని దర్గా కమిటీ సభ్యులకి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీష్ మాట్లాడుతూ దర్గా వన్నూరు స్వామి పునర్నిర్మాణానికి తనవంతు సహాయం అందించానని ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో పునర్నిర్మాణానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు శివలింగప్ప ధనంజయ గ్రామ పెద్దలు నారాయణప్ప, విజయ్ మోహన్, సాకే పుల్లయ్య, మహిపతి, ఎర్రి స్వామి ఓబులేసు, భాస్కర్, సూపి కరీం తదితరులు పాల్గొన్నారు.


