- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం:: ఉచిత వైద్య శిబిరం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనివల్ల పేద ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కన్వీనర్ సాంబశివుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని శిరిడి సాయిబాబా దేవాలయ ఆవరణ నందు ఉచిత వైద్య శిబిరమును నిర్వహించారు. వైద్యులచే 160 మందికి వైద్య చికిత్సలను అందించడంతోపాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందని కన్వీనర్ సాంబశివుడు తెలిపారు. ఈ శిబిరం శ్రీ సత్య సాయి సేవ సమితి -2 ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు.


