Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్మార్ట్ రేషన్ కార్డులు పేదలకు వరం..

స్మార్ట్ రేషన్ కార్డులు పేదలకు వరం..

- Advertisement -

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; స్మార్ట్ రేషన్ కార్డులు పేదలకు వరంగల్ గా మారాయని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ప్రవేశపెట్టిన నూతన స్మార్ట్ రేషన్ కార్డులు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ధర్మవరం పట్టణంలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి 22 వ వార్డు సాయి నగర్, 30 వ వార్డు దుర్గా నగర్, 36 వ వార్డు కొత్తపేటలో ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్షమని ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ప్రజలకు మరింత పారదర్శకంగా, వేగవంతంగా నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందించడానికి ఉపయోగపడతాయని అదేవిధంగా ఆధునిక సాంకేతికత వినియోగంతో అవినీతి, మధ్యవర్తిత్వం తగ్గిపోతుందని ప్రతి అర్హులైన కుటుంబానికి నేరుగా ప్రయోజనం చేరేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేశారు. అదేవిధంగా ‘స్త్రీ శక్తి’ పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా వారి ఆర్థిక భారం తగ్గి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మరింత ముందుకు సాగేందుకు దోహదపడుతుందని అలాగే ‘తల్లికి వందనం’ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల పట్ల గౌరవ భావన పెంపొందించడమే కాకుండా, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తోందని వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు