Homeజిల్లాలుఅనంతపురంతెలుగుదేశం పార్టీ వర్గ పోరుతో పంచాయితీలలో గట్టెక్కేనా?

తెలుగుదేశం పార్టీ వర్గ పోరుతో పంచాయితీలలో గట్టెక్కేనా?

- Advertisement -

విశాలాంధ్ర -శింగనమల : శింగనమల మండలంలో తెలుగుదేశం పార్టీ వర్గ పోరు, అసమ్మతిలో రాబోవు పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గట్టెక్కేరా?
మండల వ్యాప్తంగా అధికార పార్టీని అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టించే వారు కొందరైతే, అలాంటివారికే నాయకులు ప్రాధాన్యతనిస్తున్నారని, పార్టీ కోసం నిరంతరం కష్టపడి జెండా మోసిన వారికి ప్రాధాన్యత ఇవ్వ లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అసమ్మతి రాజకీయాలతో తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికల్లో ఎంత మాత్రం పరువు నిలుపుకుంటుందో? వేచి చూడాలి, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో శింగనమల మండలంలో అధికారంలో ఉన్నా, నాయకుల అత్యుత్సాహంతో ఐదు సీట్లకే పరిమితమైనారని, ప్రతిపక్షంలో లేకున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఇచ్చిందని, తెలుగుదేశం పార్టీలోని అసమ్మతులు వర్గపోర్ల మధ్య నలుగుతున్న నిజమైన కార్యకర్తలు తీవ్రఅసమ్మతితో ఉన్నారని, నాయకులు పైసలు లేనిదే పనిచేయడం లేదని, నిరంతరం జండా మోసిన వాడు నాయకుల దగ్గరకు పని కోసం వెళ్లినా పైసలు ముట్ట జెప్పందే పని చేయడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మండలముఖ్య నాయకుల పంచాయతీల్లో ఎంపిటిసి స్థానాలు గట్టెక్కలేదని, దీన్నిబట్టి చూస్తే నాయకుల్లో ఏమాత్రం పట్టుదల ఉందో అర్థం అవుతోందని, పార్టీకి కార్యకర్తలు పట్టుకొమ్మల్లాంటి వారని, కార్యకర్తలను విస్మరించిన ఏ నాయకుడు నిలబడలేదని గాలికి కొట్టుకొని పోతున్నారని, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి శింగనమల మండలంలో నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు