పంచాయితీలు ఏ మలుపు తిరగనున్నాయో
విశాలాంధ్ర – చాట్రాయి : చాట్రాయి మండల పరిషత్ ఎన్నికలలో ప్రజలు సరికొత్త చరిత్రను సృష్టించి విప్లవాత్మకమైన తీర్పు ఇచ్చారు. ఎవరు ఊహించని ఫలితాలను ఇచ్చారు. ముఖ్యంగా మండలంలో ని పోలవరం లో వైసిపి ,టిడిపి లకు బలమైన అతి పెద్ద పటిష్టమైన నాయకత్వం ఉన్న గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి పానుగంటి రజినీని గెలిపించి వినూత్న తీర్పును ఇచ్చారు. ఎడ్లు,ఎడ్లు పోట్లాట మధ్యలో లేగదూడలు నలుగుతాయని పాత సమేత అయితే దానికి బిన్నంగా రెండు పార్టీలలో వున్న అసమ్మతి వాదులంతా ఏకమై స్వతంత్ర అభ్యర్థిని గెలిపించి సత్తా చాటుకున్నారు. కొంతమంది సీనియర్ నాయకులకి మరో వెలుగుని ఇచ్చారు. ఈ సందర్భంలోనే వారు పట్టుదల కోసం ఇల్లులు తిరిగారు. వైఎస్ ఆర్ పార్టీ కి 18 గ్రామాలకు పునాది రాయిలాంటి బూరుగగూడెంలో టిడిపికి చెందిన సాధారణ యువతి ఎంపీటీసీగా తొలిసారి గెలవడం విచిత్రం . పూర్వం రోజుల నుండి చిత్తపూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వైసిపి తన ఆదిపత్యాన్ని కేవలం ఒక ఓటుతో గెలిచి ప్రతిష్ట నిలుపుకొంది. ఇక తెలుగుదేశం పార్టీకి తుమ్మగూడెం, కొత్తగూడెం, చీపురుగూడెం ,జనార్దనవరం గ్రామాలలో భారీ ఆధిక్యతను చూపించడం ఒక ప్రత్యేకతగా నిలచింది. తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి చరిత్రలో ఎన్నడు గెలవలేనిది ఈ ఎన్నికల్లో బోణి కొట్టడమే కాకుండా నాలుగు వేల పైచీలుకు ఓట్లను సాధించడానికి ఆధారంగా నిలిచాయి నాలుగు గ్రామాలలోనే 3500 పైగా అధిక్యత వచ్చినట్లు కనబడుతోంది. వైయస్సార్ పార్టీ మండల ఎంపీపీ స్థానాన్ని కచ్చితంగా కైవసం చేసుకోవాల్సింది కృష్ణారావు పాలెం, నరసింహారావు పాలెం,చిత్తపూరు ,పోతనపల్లి గ్రామాలకు పరిమిత మయింది.
ఫలించిన మంత్రి వ్యూహం
వైయస్సార్ పార్టీకి కంచుకోట ఆయన చాట్రాయి మండలంలో పచ్చజెండా ఎగరవేయడమే లక్ష్యంగా మంత్రి కొలుసు పార్థసారథి ఎన్నికలలో తానే పోటీ చేసినట్లు వ్యక్తిగత బాధ్యత తీసుకుని ఎక్కడతేడా అనిపిస్తే అక్కడ వున్న కీలకమైన వ్యక్తులు నాయకులు ఓటరును ప్రభావితం చేసే శక్తి ఉన్న వారందరితో వ్యక్తిగత సంప్రదింపులు జరపడం ద్వారానే ఎన్నికల ఫలితాలు తారుమరయ్యాయని పలువురు అంటున్నారు.
పంచాయతీలపై ప్రభావం
మండల పరిషత్ ఎన్నికల ప్రభావం పంచాయతీ ఎన్నికల ఏ మేరకు పడుతుంది ఏ విధమైన తీర్పిస్తారు అనేది ప్రస్తుతం చర్చగా మారింది.
సరికొత్త చరిత్ర సృష్టించిన చాట్రాయి మండల ఓటర్లు
- Advertisement -
RELATED ARTICLES


