Homeజిల్లాలుకర్నూలునామినేషన్ వేసే ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాలి

నామినేషన్ వేసే ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాలి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : ఎన్నికల్లో నామినేషన్ వేసే ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. దీనికి పోలీసులు కూడా రాజకీయ బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గమని విమర్శించారు. ప్రతిపక్షాలు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. బలవంతపు ఏకగ్రీవాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పోటీ చేసే హక్కు, స్వేచ్ఛగా ఓటరు వేసే హక్కును కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న, నాయకులు డోలు హనుమంతు, జైరామ్, నాగరాజు, డోలా సాబ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు