Homeజిల్లాలుఅనంతపురంగ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల

గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల

- Advertisement -

విశాలాంధ్ర-రాప్తాడు : ఏపీ రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత (ఫేజ్-I) ఎన్నికల నోటిఫికేషన్ మరియు షెడ్యూల్‌ను ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి బి. విజయలక్ష్మి డిప్యూటీ ఎంపీడీవోలు అశోక్ బాబు, అచ్యుతానంద బాబులతో కలిసి శుక్రవారం విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ ఈ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 15, 2026న ఎన్నికల నోటీసు జారీతో పాటు వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శిస్తామన్నారు. అదేరోజు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై ఈనెల 17 వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు చివరి గడువు ఉంటుందన్నారు. ఈనెల 18న ఉదయం 8.00 గంటల నుండి నామినేషన్ల పరిశీలన, చేస్తామని,
నామినేషన్ల తిరస్కరణపై 19వ సాయంత్రం 5.00 గంటల వరకు ఆర్డీవో వద్ద అప్పీల్ చేసుకుంటే నవంబర్ 20న పరిష్కరిస్తారన్నారు. అభ్యర్థుల ఉపసంహరణకు నవంబర్ 21 మధ్యాహ్నం 3.00 గంటల వరకు అవకాశం ఉందని, అదేరోజు మధ్యాహ్నం 3.00 గంటల తరువాత బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు. ఈనెల 26న ఉదయం 7.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2.00 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఫలితాలు వెలువడిన రోజే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు