Homeజాతీయంప్రధాని మోదీ నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారు: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

ప్రధాని మోదీ నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారు: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

- Advertisement -

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.దేశ వ్యతిరేక కార్యకలాపాలు, విదేశీ శక్తుల ప్రమేయానికి సంబంధించిన అనేక ఆధారాలు తన ఫోన్‌లోనే భద్రంగా ఉన్నాయని వెల్లడించారు.ఇదే సమయంలో ప్రధాని మోదీతో ముఖాముఖి బహిరంగ చర్చకు రావాలని మరోసారి సవాల్ విసిరారు.సోషల్ మీడియా వేదికగా నిర్వహించిన ఃఆస్క్ మీః ఇంటరాక్టివ్ సెషన్‌లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానాలు ఇచ్చారు.ప్రధాని మోదీతో తనకు ముఖాముఖి చర్చ జరిగితే అనేక కీలక విషయాలు బయటపడతాయని అన్నారు.

మైక్‌ను పదేపదే కట్ చేస్తున్నారు: రాహుల్
ఆ చర్చ ముగిసే సమయానికి మోదీ ప్రధానిగా కొనసాగలేరని వ్యాఖ్యానించారు.విదేశీ శక్తుల ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తున్నారు?నిజమైన దేశద్రోహులు ఎవరు?అనే విషయాలు ఈ చర్చ ద్వారా దేశ ప్రజలకు స్పష్టమవుతాయని పేర్కొన్నారు.పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం చెబుతున్నప్పటికీ, బయట బహిరంగ చర్చ జరగాలని ఎందుకు కోరుకుంటున్నారంటూ ఓ నెటిజన్ ప్రశ్నించారు.దీనికి రాహుల్ స్పందిస్తూ..లోక్‌సభలో ప్రతిపక్షనేతగా తనకు మాట్లాడేందుకు తగిన అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు.కీలకమైన అంశాలను ప్రస్తావించిన ప్రతిసారీ తన మైక్‌ను పదేపదే కట్ చేస్తున్నారని చెప్పారు.పార్లమెంట్‌లో గంటల తరబడి ప్రసంగాలు చేయడం కంటే,ఇద్దరు నేతలు ఎదురెదురుగా కూర్చొని ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు చెప్పుకునే బహిరంగ చర్చే మరింత పారదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

బహిరంగ చర్చకు న్యాయనిర్ణేతలుగా ఎవరిని నియమించినా అభ్యంతరం లేదు: రాహుల్
గతంలో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన రైతుల ఆందోళనలు, వాటికి కారణమైన వ్యవసాయ చట్టాలు, ఓట్ల అక్రమాల వివాదం, చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలు వంటి అంశాలను రాహుల్ ప్రస్తావించారు.

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన పుస్తకంలోని విషయాలు, అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన ఎప్‌స్టీన్ ఫైల్స్‌పైనా పార్లమెంట్‌లో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.ఈ కీలక అంశాలపై సభలో చర్చించకుండా తనను అడ్డుకున్నారని గుర్తు చేశారు.ప్రధాని మోదీతో తాను ప్రతిపాదించిన బహిరంగ చర్చకు న్యాయనిర్ణేతలుగా ఎవరిని నియమించినా తనకు అభ్యంతరం లేదని రాహుల్ స్పష్టం చేశారు.పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లేదా ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్‌ను జడ్జీలుగా నియమించినా అంగీకరిస్తానని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన బీజేపీ నేతలు
మరోవైపు,రాహుల్ గాంధీ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను,ప్రధాని మోదీకి విసిరిన బహిరంగచర్చ సవాల్‌ను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు.పార్లమెంట్‌లో జరిగే ప్రజాస్వామ్యబద్ధమైన చర్చల నుంచి తప్పించుకునేందుకే రాహుల్ ఇలాంటి రాజకీయ నాటకాలకు తెరతీస్తున్నారని విమర్శించారు.సభలో మాట్లాడకుండా బయట బహిరంగ చర్చ పేరుతో సవాళ్లు విసరడం ఆయన రాజకీయ అపరిపక్వతకు,బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.ఈ వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ అంశంపైనైనా విస్తృతంగా చర్చించేందుకు పార్లమెంట్ అత్యుత్తమవేదిక అని పేర్కొన్నారు.లోక్‌సభ ప్రతిపక్ష నేత వంటి అత్యంత బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రాహుల్ గాంధీ అనవసరమైన రాజకీయ గారడీలకు పాల్పడకుండా,తన పదవి ప్రాధాన్యతను, బాధ్యతలను అర్థం చేసుకోవాలని హితవు పలికారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు