Homeజిల్లాలుశ్రీ సత్యసాయిక్షయ వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించాలి..

క్షయ వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించాలి..

- Advertisement -

డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ ఓ. డాక్టర్ భాగ్యలక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం;; క్షయ వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించాలని డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కొత్తపేట తారకరామాపురంలలో మొబైల్ హ్యాండ్ ఎక్స్రే ద్వారా పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎక్సరే పరీక్షల ద్వారా ముందస్తుగా ఊపిరితిత్తులకు ఎక్స్రే తీపించుకోవడం ద్వారా ఏమైనా చేయవ్యాధి లక్షణాలు ఉన్నాయా అన్న విషయం బయటపడుతుందని తెలిపారు. ఒకవేళ క్షయ వ్యాధి ఉన్న యెడల మందులు వాడే అవకాశం ఉందని తెలిపారు. తదుపరి క్షయవాదిపై రోగులకు అవగాహన సదస్సును కూడా నిర్వహించారు. మొత్తం 150 మందికి ఎక్స్రే లను తీయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్షయ వ్యాధి విభాగం డాక్టర్ ప్రియాంక, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ ఆంజనేయులు, నాగేంద్ర, హెల్త్ సూపర్వైజర్ కిష్టప్ప, హెల్త్ అసిస్టెంట్ మోహన్, ఆరోగ్య కార్యకర్తలు అశ్విని, వహీదా, చంద్రక, రమా, సుధారాణి, ఆశా కార్యకర్తలు సుజాతమ్మ, కళ్యాణి ,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు