ఆలయ ఈవో నాగరత్నమ్మ
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని పిఆర్టి వీధిలో గల శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఆలయ ఈవో నాగరత్నమ్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ, గోదా రంగనాయకుల కళ్యాణ కమిటీ వారు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీతోపాటు గోదా రంగనాయకుల కళ్యాణ కమిటీ వారు కూడా పాల్గొన్నారు.
ఘనంగా జరిగిన గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవ వేడుకలు..
RELATED ARTICLES