బంగారం ధరల్లో ఒక్కరోజులోనే భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్న అక్షయ తృతీయ వేళ స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధరలు నేడు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏకంగా తులం పుత్తడిపై రూ.2 వేలు తగ్గింది. పుత్తడి ధరలు దిగొస్తుండడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము ) రూ.9,573, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము ) రూ.8,775 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2000 తగ్గడంతో రూ. 87,750 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,180 తగ్గడంతో రూ. 95,730 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,900గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2160 తగ్గడంతో రూ. 95,880 వద్ద ట్రేడ్ అవుతోంది.
బంగారంతోపాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. నేడు సిల్వర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ కిలో వెండిపై రూ.100 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈరోజు కిలో వెండి ధర రూ. 1,08,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 99,900 వద్ద అమ్ముడవుతోంది.