Wednesday, February 18, 2026
Homeజిల్లాలునెల్లూరుకూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన... యువ నాయకులు పాలేటి రవి

కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన… యువ నాయకులు పాలేటి రవి

- Advertisement -

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమని అయ్యవారిపల్లి గ్రామతెలుగుదేశం పార్టీ యువ నాయకులు పాలేటి రవి అన్నారు శుక్రవారం రాత్రివలేటివారిపాలెం మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాలతో… సుపరిపాలన తొలి ఏడాది కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీ నరసింహాం ఆధ్వర్యంలో ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో జరిగిన సంక్షేమం మరియు అభివృద్ధిని కరపత్రాల రూపంలో ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువ నాయకులు పాలేటి రవి మాట్లాడుతూ గతంలో పంచాయితీలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగిన అభివృద్ధి తప్ప మరే ప్రభుత్వం చేయలేదని అన్నాను. ఎన్టీఆర్ భరోసా పింఛన్, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాల గురించి ఆరా తీశారు. అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకంను కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం లో గ్రామ పార్టీ అధ్యక్షులు మంచాల మల్లికార్జున, డీలర్ రవి, రామయ్య,హరిబాబు, ఫిల్డ్ అసిస్టెంట్ మంచాల మాలకొండరాయడు, నవీన్,భరత్ కుమార్,గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు