విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా రాజాం అమ్మవారి కాలనీలో వేంచేసిన శ్రీ అభయ ఆంజనేయస్వామి వారికి మహాధ్యాసo శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు మావుడూరి వెంకటరమణ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదములు అందించారు. అమ్మవారికాలనీ, ఆదర్శనగర్ కాలనీ, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంపలి లక్ష్మణ,మహదాస్యం బాబ్జి, వెంపల లక్ష్మణరావు, మహాధ్యాసo వంశీ, గడే అప్పలనాయుడు,కొత్తకోట గోవిందరావు, బొండాడ సత్యరావు, ఆమిటి చిన్నారావు, లొట్టి తవుడు, చీకటి కేశవరావు, తదితరులు పాల్గొన్నారు.