విశాలాంధ్ర ధర్మవరం; పట్టణము లోని శారదా నగర్ మరియు చంద్రబాబు నగర్ కాలనీ ల యందు గల ప్రజలు కుటుంబ సమేతంగా ఘనంగా హోలీ పండుగను జరుపుకున్నారు. అనంతరం ఎస్బిఐ ఉద్యోగి గోపాల్ నాయక్ మాట్లాడుతూ హోలీ పండుగ విశిష్టతను వారు తెలియజేశారు. వందలాదిబంది కుటుంబ సభ్యులు మహిళలతో సహా, చిన్నపిల్లలతో రంగులు వేసుకుంటూ తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, తదుపరి ఆనందము ఐక్యతను స్వాగతించడానికి ఈ హోలీ పండుగను జరుపుకుంటారని వారు. ఈ పండుగ ప్రహ్లాదుడు హోలిక కథతో ముడిపడి ఉందని తెలిపారు. చాలా భారతీయ పండుగల మాదిరిగానే హోలీ కి కూడా ప్రకృతిలో లోతైన సంబంధాలు ఉన్నాయని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో
ఎన్. రామునాయక్, వి. తిరుపాల్ నాయక్, డి. శీనా నాయక్, రంగే నాయక్, సోమ్లా నాయక్, ఎన్. గోపాల్ నాయక్ (S. B. I ), వి. రాందాస్ నాయక్, డి.ఘనే నాయక్ తో పాటు వందలాది మంది కుటుంబ సభ్యులు, శారదానగర్ ప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా హోలీ పండుగ వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


