Friday, March 6, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఐదవ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు

ఐదవ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు

- Advertisement -

జయకృష్ణ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; ఆనాటి నుండి ఈనాటి వరకు హిందూ దేవాలయాలలో జరుగుతున్న అన్యాయాలు, పరిష్కరించని సమస్యలపై హిందూ సమ్మేళనా కమిటీ ఉపాధ్యక్షులు, జయకృష్ణ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ వివేక్ కుల్లాయప్ప యాదవ్ నిరాహార దీక్షలను పట్టణంలోని ఆశ హాస్పిటల్ ఎదురుగా గల ఆవరణములో ఐదవ రోజు కొనసాగింది. . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తాము హిందూ ధర్మం కాపాడడం కోసం అనేక పోరాటాలు సల్పడం జరిగిందని, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఈ నిరాహార దీక్షలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుండి తొలగించాలని, స్వతంత్ర హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని, విద్యా సంస్థలలో హిందూ ధర్మ బోధన అనుమతించాలని, దేవాలయ మాన్యాలు ఆక్రమణలు తొలగించాలని, హిందూ మైనారిటీ విద్యాసంస్థలు ఏర్పాటుకు అనుమతించాలని, పూజారులకు 15వేల రూపాయలు నెలసరి వేతనం ఇవ్వాలని, పల్లెటూరు లలో ప్రజల ప్రాణాలు కాపాడడానికి పల్లెటూరు హాస్పిటల్ లో 24 గంటల పాటు ఎంపీపీ ఎస్ డాక్టర్ అందుబాటులో ఉండాలని, ప్రతి పీహెచ్సీ లో ముగ్గురు ఎంపీపీ ఎస్ డాక్టర్లను ప్రభుత్వం వెంటనే నియమించాలని వారు డిమాండ్ చేశారు. మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఈ దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు