విశాలాంధ్ర- వలేటివారిపాలెం : కేంద్ర ప్రభుత్వం నూతనంగా జాతీయ ఉపాధి హామీ పథకానికి బదులుగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ రోజుగా మిషన్ గ్రామీణ్ పథకంలో కూలీలుగా పనిచేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవలసి ఉంటుందని ఎంపీడీఓ వై. శంకరరావు తెలిపారు. విశాలాంద్ర విలేకరితో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఈ కేవైసీ చేయించుకున్న వారికి ఇబ్బంది లేదని, అయితే ఈ కేవైసీ చేయించుకోని వారు కూలి పనులకు వస్తే వారికి హాజరు పడదని,అందువల్ల వారికి వారు చేసిన పనికి కూలి వచ్చే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. అయితే ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద పనిలోకి వచ్చే ముందుగానే ఈకేవైసీ చేయించుకునే అవకాశం ఉన్నందున మీ గ్రామ పీల్డ్ అసిస్టెంట్ వద్ద చేయించుకున్నాకనే పనిలోకి రావాలని ఆయన సూచించారు. అలాగే పనిలోకి వచ్చిన వెంటనే ప్రతి కూలి ఈ కేవైసీ ఫోటో హాజరు తీయడం జరుగుతుందని వారు తెలిపారు. పనిలోకి వచ్చిన వెంటనే ఒకసారి ఫోటో హాజరు తీయడం జరుగుతుందని, పని ప్రారంభమైన నాలుగు గంటల తర్వాత మళ్లీ హాజరు తీయడం జరుగుతుందని రెండవ పర్యాయం హాజరు లేకపోతే ఆరోజు చేసిన పనికి పూర్తిగా కూలి వచ్చే పరిస్థితి లేదని కావున ఉపాధి పనులకు వచ్చే కూలీలు తప్పనిసరిగా పని పూర్తి అయ్యేంతవరకు పని దగ్గరే ఉండాల్సి వస్తుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు.


