షిరిడి సాయిబాబా సేవా సమితి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని చేనేత కళాకారుడు, ప్రముఖ డిజైన్ కళాకారుడు జుజారు నాగరాజు జాతీయ అవార్డు ప్రకటించిన సందర్భంగా పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో జూజారు నాగరాజు దంపతులను శిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ వారు ఘనంగా సత్కరించారు. అనంతరం అధ్యక్షులు వీరనారాయణ ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి కార్యదర్శి రామలింగయ్య ఉప కార్యదర్శి నాయుడు కోశాధికారి సూర్యనారాయణ , డైరెక్టర్ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ జూజారు నాగరాజు, జాతీయ అవార్డు పొందడం దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు, ధర్మవరంకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తేవడం ఎంతో శుభ సూచకమని తెలిపారు. మున్ముందు మరిన్ని అవార్డులు పొందాలని వారు తెలిపారు.
జాతీయ అవార్డు గ్రహీతకు సన్మానం..
- Advertisement -
RELATED ARTICLES


