Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమంత్రాలయమునకు నూతన ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్ ప్రారంభం…

మంత్రాలయమునకు నూతన ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్ ప్రారంభం…

- Advertisement -

డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మారం నుండి మంత్రాలయమునకు నూతన కొత్త ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసును ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 26వ తేదీ ఉదయం 5:15 నిమిషాలకు ధర్మారం నుండి బయలుదేరి వయా అనంతపురం, గుత్తి ,పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు మీదుగా మంత్రాలయమునకు ఉదయం 11 గంటలకు చేరుతుందని తెలిపారు. తిరిగి మంత్రాలయంలో ఉదయం 11:30 గంటలకు బయలుదేరి ధర్మవరమునకు సాయంత్రం 5:15 నిమిషాలకు చేరుతుందని తెలిపారు. మంత్రాలయమును దర్శించుకునే భక్తాదులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు తెలియజేశారు. ఆన్లైన్ ద్వారా సీటులను రిజర్వేషన్ చేసుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు