విశాలాంధ్ర ధర్మవరం; నియోజకవర్గంలోని ధర్మవరం మండల పరిధిలోని గొట్లూరు గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా కేంద్ర ప్రభుత్వం అధికార పూర్వకంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో గొట్లూరు గ్రామానికి చోటు దక్కడం అభినందించేదగ్గ విషయమని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా అందులో ఈ గ్రామం ఉండడం గొప్ప విశేషమని అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట లో జరిగే స్వాతంత్య వేడుకలకు హాజరుకావాలని సర్పంచ్ పిట్ట నరసింహకు ఆహ్వానం అందడం జరిగిందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ గ్రామంలో ఇంటింటికి తాగునీరు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా, చెత్త సేకరణలో ప్రజల భాగస్వామ్యం అధికంగా ఉండడంతో ఉత్తమ పంచాయతీగా ఎంపిక కావడం జరిగిందని ఎంపీడీవో తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, గ్రామ ప్రజలు పిట్టా నరసమ్మను అభినందించడం జరిగింది.
ఉత్తమ గ్రామ పంచాయతీగా జాతీయ స్థాయిలో గొట్లూరు ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


