Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రజా సమస్యల పరిష్కారంకోసం పరిటాల శ్రీరామ్ సరికొత్త ప్రయత్నం

ప్రజా సమస్యల పరిష్కారంకోసం పరిటాల శ్రీరామ్ సరికొత్త ప్రయత్నం

- Advertisement -

సచివాలయాల పరిధిలో గ్రీవెన్స్

విశాలాంధ్ర ధర్మవరం; ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తైన సందర్భంగా సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమం ధర్మవరం నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే జిల్లాలో ధర్మవరం అగ్ర స్థానంలో ఉంది. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి పలు రకాల సమస్యలు శ్రీరామ్ తో పాటు టీడీపీ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వీటి పరిష్కారానికి ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహించాలని శ్రీరామ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సచివాలయం పరిధిలో గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మున్సిపల్, విద్యుత్ తో పాటు పలు విభాగాల అధికారులను కూడా భాగస్వామ్యం చేయనున్నట్టు చెప్పారు. మొదట ధర్మవరం నియోజరవర్గంలో ప్రతి రోజు నాలుగు సచివాలయాల పరిధిలో గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. అన్ని చోట్ల శ్రీరామ్ స్వయంగా పాల్గొనబోతున్నారు. ముందుగా శుక్రవారం రోజు 7, 8వ వార్డులలో ప్రారంభించనున్నారు. పట్టణంలోని శివానగర్ లో ఉన్న శివాలయంలో శ్రీరామ్ ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఏడు కొళాయిల పార్కు వద్ద ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నారు.ఈ కార్యక్రమాన్ని ధర్మవరం పట్టణంతో పాటు మిగిలిన నాలుగు మండలాల్లో కూడా నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి రూరల్ మండల నాయకులతో శ్రీరామ్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మన పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను కూడా మనం పట్టించుకోకపోతే ప్రజలు ఇబ్బందులు పడుతారన్నారు. మనం ఏ సచివాలయం పరిధిలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నది ముందే ఆటోల ద్వారా చాటింపులు వేయించి.. వీలైనంత ఎక్కువ మంది నుంచి అర్జీలు స్వీకరించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు పక్కన పెట్టి, మన నియోజకవర్గంలో మనం ఎంత వరకు వీరి సమస్యలు తీర్చగలమన్నది ముఖ్యమని తెలిపారు. ఇది ప్రజలకు, మనకు మధ్య బంధాన్ని మరింత పెంచుతుందని శ్రీరామ్ అన్నారు. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఇందులో భాగస్వామ్యులు కావాలని,ప్రజల సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రజలు కూడా దీనిని సద్వినియోగం చేసుకుని, మీ సమస్యలకు పరిష్కారం పొందాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు