Wednesday, February 19, 2025
Homeజిల్లాలుకర్నూలుభార్యను చంపిన భర్తకు జైలు శిక్ష

భార్యను చంపిన భర్తకు జైలు శిక్ష

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని గంగులపాడు గ్రామానికి చెందిన కురువ నాగేష్ కు భార్యను చంపిన కేసులో కోర్టు గురువారం యావజ్జీవ శిక్ష విధించినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో గ్రామానికి చెందిన కురువ జయలక్ష్మి తన భర్త నాగేష్ ను ఇంటి పని చెయ్యమని చెప్పిందన్నారు. దీంతో కోపగించుకొన్న నాగేష్ ఇంట్లో రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో భార్య కురువ జయలక్ష్మిని గొడ్డలితో నరికి హత్య చేశాడన్నారు. మృతురాలి తండ్రి కురువ యల్లప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని కోసిగి సీఐ ప్రసాద్ దర్యాప్తు చేపట్టి కోర్టుకు నివేదికను సమర్పించారని తెలిపారు. అన్ని కోణాల్లో విచారించిన ఆదోని రెండవ అదనపు జిల్లా కోర్టు జడ్జి ముద్దాయి కురువ నాగేష్ కు యావజ్జీవ కారాగార శిక్ష మరియు 15వందల రూపాయలు జరిమాన విధించినట్లు తెలిపారు. కేసులో ముద్దాయికి శిక్ష పడేందుకు కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను, పెద్దకడబూరు పోలీసులను, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు