Homeఆంధ్రప్రదేశ్ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ నడపాలి : బి గిడ్డయ్య

ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ నడపాలి : బి గిడ్డయ్య

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరోకర్నూలు : కర్నూలు నుండి విజయవాడకు, విజయవాడ కర్నూలుకు ప్రతి రోజు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ నడపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య డిమాండ్ చేశారు. శనివారం కర్నూలు సిటీ రైల్వేస్టేషన్ ఎదుట సీపీఐ నగర సమితి ఆద్వర్యంలో సీపీఐ నగర కార్యదర్శి పీ రామకష్ణారెడ్డి అద్యక్షతన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సీపీఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య దీక్షలు ప్రారంబించి దీక్షలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజదాని అమరావతికి వెళ్ళాలంటే కర్నూలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాచిగూడ నుండి గుంటూరు దాకా వెళ్ళెప్యాసింజర్ రైలు విజయవాడ వరకు పోడిగించాలన్నారు. మహబూబ్‌నగర్ నుండి విశాఖ పట్నం వెళ్ళె రైలును కర్నూలు దాక పోడిగించాలన్నారు.కర్నూలు నుండి ఇండస్ట్రీయల్ కారిడార్ అయిన ఓర్వకల్లు మీదుగా బేతంచెర్ల వరక రైల్వేలైన్‌పనులు ప్రారంభి ంచాలన్నారు. అన్ని ఎక్స్‌స్రెస్ రైలుల్లో జనరల్ బోగీలు పెంచాలన్నారు. రద్దుచేసిన మచిలీపట్నం రైలును పునరుద్దరించాలన్నారు. కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రైల్వే వ్యాగిన్ తయారీ కేంద్రానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలన్నారు. కర్నూలు నుండి శ్రీశైలం, మంత్రాలయంకు రైల్వేలైన్ వేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించే రైల్వే డడ్జెట్‌లో నిధులు కేటాయించి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. లేనిపక్షంలో సమస్యలు పరిష్కారం అయ్యోంత వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాధం, సీపీఐ నగర సహాయ కార్యదర్శులు సీ మహేష్, శ్రీనివాసులు, నగర కార్యవర్గ సభ్యులు నల్లన్న, భారతి, రాముడు, రామచంద్ర, రామాంజనేయులు పెద్దఎత్తున సీపీఐ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.:

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు