Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిదేశాల్లో చిక్కుకున్న సయ్యద్ ఫరూక్ కు ఐ హెచ్ ఆర్ పి సి సభ్యులు చేయుత..

విదేశాల్లో చిక్కుకున్న సయ్యద్ ఫరూక్ కు ఐ హెచ్ ఆర్ పి సి సభ్యులు చేయుత..

- Advertisement -

ఇంటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్, నేషనల్ లీగల్ సెల్ ఉపాధ్యక్షురాలు, లాయర్ సుమలత
విశాలాంధ్ర ధర్మవరం: ఉపాధి కోసం ధర్మవరం పట్టణానికి చెందిన షహీద్ ఫారుక్ సౌదీ అరేబియా కు వెళ్లి తీవ్ర ఇబ్బందులతో పాటు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వీడియోలను ఐహెచ్ఆర్పిసి సభ్యుల దృష్టికి రావడం జరిగింది. దీంతో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కమిషన్ కార్యాలయంలో నేషనల్ లీగల్ సెల్ ఉపాధ్యక్షురాలు లాయర్ సోమలత సయ్యద్ ఫారూఖ్ను ఇండియాకు తెప్పించేందుకు పలు విషయాలను వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సయ్యద్ ఫరూక్ ఇబ్బందులను తమకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ మానవ దృక్పథంతో స్పందించి కేంద్ర విదేశా శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కు రాసిన ఉత్తరం విధేయతమే భారతదేశానికి అతనిని తిరుగు ప్రయాణాన్ని తక్షణమే వేగవంతం చేయాలన్న ఆదేశాలు రావడంతో సయ్యద్ ఫరూక్ ఇండియాకు రావడం జరిగిందని తెలిపారు. సోషల్ మీడియా, కొన్ని పత్రికల కథాంశాలు ద్వారా సమస్యకు పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. రెండు నెలలుగా సయ్యద్ ఫరూక్ ఇబ్బందులు సౌదీ అరేబియాలో పడటం అందరినీ కలిచి వేసిందని, ఆ బాధను, ఆ కష్టాన్ని తాము ఇంటర్నేషనల్ వైడ్ గా మా ఆర్గనైజేషన్ పని చేసిందని తెలిపారు. అలాగే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మా ఆర్గనైజేషన్ మెంబర్ ఒకరు నెలపాటు సయ్యద్ ఫరూక్ తో ఉండి లీగల్ గా కావలసిన సహాయ సహకారాలను అందించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా సహాయం చేయడం, ఇండియాకు వచ్చేంతవరకు మా ఆర్గనైజేషన్ తరపున సహాయ సహకారాలను అందించడం ముమ్మాటికీ వాస్తవమని వారు స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలో ఇప్పటికి దాదాపు 50 మంది భారతీయులు కూలీలుగా వెళ్లిన వారు కూడా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం కూడా మాకు తెలిసిందని, వారిని కూడా చట్టపరంగా మా సంస్థ పరంగా బయటకి తెస్తామని తెలిపారు. సౌదీ అరేబియా తో పాటు మరికొన్ని దేశాలలో భారతీయులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని ప్రధానమంత్రి మోడీకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, మంత్రి నారా లోకేష్, సత్య కుమార్ యాదవ్ కు తెలియజేస్తామని తెలిపారు. సయ్యద్ ఫరూక్ ఇండియా తో పాటు ధర్మవరానికి రావడానికి కృషి చేసిన కేంద్ర విదేశీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ కు, మంత్రి సత్య కుమార్ యాదవ్కు, ఇంచార్జ్ హరీష్ బాబుకు ప్రత్యేకంగా మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు