విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ద్వితీయ సంవత్సరంలో 100 మంది విద్యార్థులకు గాను 93 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 103 మంది విద్యార్థులకు గాను 62 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఈ. పునర్విక 937 మార్కులు, కే. కీర్తన 934 మార్కులు, ఎస్. రియాజ్ 892 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో పి. సంధ్య 880 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగానికి చెందిన ఉషా 445/470 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో ఎస్. జూహా 455/470 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో టి. హన్సిక 454/500, జువేరియా 452/500 మార్కులు సాధించారు. హెచ్ఈసీ విభాగంలో టి. శివకుమార్ 406/500 మార్కులు సాధించారు. కళాశాల ప్రిన్సిపాల్ బాలప్ప మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదవడం, ఉపాధ్యాయుల మార్గదర్శకంతో మంచి ఫలితాలు సాధించారని తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.


