తెహ్రాన్: అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ పన్నుల రూపంలో ఒత్తిడి పెంచడానికి ఉపక్రమించింది. చమురు ధరలు భగ్గుమంటున్న క్రమంలో అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ కొత్త చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పర్షియన్ గల్ఫ్‌లో యూఎస్ మిత్ర దేశాల ట్యాంకర్లపై సెక్యూరిటీ డ్యూటీలు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు అధికార వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం… పర్షియన్ గల్ఫ్‌లో కార్యకలాపాలు సాగిస్తోన్న అమెరికా మిత్ర దేశాలకు చెందిన చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలకు సెక్యూరిటీ డ్యూటీ విధించేందుకు ఇరాన్ అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పటికే హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చమురు ధరలను కూడా తామే నియంత్రిస్తామని తాజాగా ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధంలో ఓటమిని అంగీకరించేవరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వ్యాఖ్యానించాయి.
ట్రంప్ హెచ్చరికలు…
ఈ క్రమంలో ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరికలు చేశారు. హర్మూజ్ జలసంధిలో చమురు సరఫరాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే… ఇప్పటివరకు ఎదుర్కొన్న దానికంటే 20 రెట్లు ఎక్కువగా దెబ్బతీస్తామని బెదిరించారు. ఆ దేశాన్ని తిరిగి కోలుకోలేనివిధంగా నాశనం చేస్తామని ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్టు పెట్టారు. అయితే…అలా జరగాలని తాను కోరుకోవడం లేదన్నారు. హర్మూజ్ మీదుగా చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు ఇది తాము ఇచ్చే గిఫ్ట్ అని వ్యాఖ్యానించారు.
అమెరికా మిత్రదేశాల ట్యాంకర్లపై సెక్యూరిటీ డ్యూటీలు: ఇరాన్ సన్నాహాలు
- Advertisement -
RELATED ARTICLES


