Homeఆంధ్రప్రదేశ్వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో అవకతవకలు జరిగాయి: సునీత

వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో అవకతవకలు జరిగాయి: సునీత

- Advertisement -

నేడు వివేకానందరెడ్డి 75వ జయంతి
సమాధి వద్ద నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 75వ జయంతి సందర్భంగా పులివెందుల్లోని ఆయన సమాధి వద్ద కుమార్తె వైఎస్ సునీత, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సునీతా రెడ్డి… వివేకా హత్య కేసు విచారణ, ఇటీవలి తీర్పులు సరిగా లేవని ఆరోపిస్తూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ సరిగా జరగకపోవడం వల్లే తాము పదే పదే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగిందనే విషయం అందరికంటే ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తెలుసని సునీత ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విచారణలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఏదో ఒక రోజు కచ్చితంగా న్యాయం జరుగుతుందనే గట్టి నమ్మకంతోనే తాను ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు