ఎన్డీఏ ప్రభుత్వము అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బురద చల్లడం మానుకో
విశాలాంధ్ర ధర్మవరం;; ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే, బురద చల్లడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలని గట్టిగా చురకను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో దౌర్జన్యాలు కబ్జాలు అక్రమ కేసులతో ప్రజలు విసిగిపోయడంతోనే, ఎన్డీఏ ప్రభుత్వానికి స్వాగతం పలకడం జరిగిందన్నారు. అతి ఘోరంగా ఓడిపోయి 11 సీట్లకు పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావడం లేదని గట్టిగా హెచ్చరించారు. ఇటీవల పల్నాడు జిల్లా సత్తెనపల్లి జగన్ పర్యటనలో ఆయన సొంత కార్యకర్త సింగమయ్య అనే వ్యక్తి కారు కిందపడి మృతి చెందిన కూడా కనికరం లేకపోవడం దారుణము కాదా? అని వారు ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం ఇష్టానుసారంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని వారు హితవు పలికారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రమంతా అప్పుల పాలు చేసి నిరుద్యోగాన్ని, పేదరికాన్ని తప్పుదోవ పట్టించడం నిజం కాదా అని వారు తెలిపారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే తప్ప అభివృద్ధి చేసింది లేదని వారు దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతిపక్ష పార్టీల నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టడం నిజం కాదా అని మరోసారి వారు గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. పరిశ్రమలను తేవడం ఉపాధి కల్పించడం ఇంక నువ్వు జరుగుతూనే ఉందని వారు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశరవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, పేద ప్రజల కుటుంబాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనునిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా మాజీ మంత్రి పేర్ని నాని పై కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తే, జాగ్రత్త నీ హెచ్చరించడం జరిగిందన్నారు. వైయస్సార్సీపి ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులను నేడు కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ రాష్ట్రంలోని 12 గిరిజన ప్రాంతాలలో సిసి రోడ్లు, బిటి రోడ్లు వేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధికి సహకరించాలే తప్ప, బురద జల్లడం, ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఇకనైనా మానుకోవాలని, ఇప్పటికే రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో గట్టి దెబ్బ గా మిమ్మలను ఓడించడం జరిగిందని తెలిపారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు వారు స్వాగతం పలుకుతున్నారని తెలిపారు.


